ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఫేస్‌బుక్' తన మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. 'వాయిస్‌ కమాండ్‌' పేరుతో ఈ ఫీచర్‌‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది..?


'యూజర్లు చెప్పే మాటలను వాయిస్ కమాండర్ టెక్ట్స్‌ రూపంలో మారుస్తుంది. దీంతో చాటింగ్ ఎంతో సులువవుతుంది. అంతేకాకుండా ఫోన్‌ను తాకకుండానే ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపే అవకాశం ఉంటుంది' అని ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే డ్రైవింగ్ చేస్తూ కూడా చాటింగ్, మెసేజ్‌లకు సమాధామివ్వొచ్చు.


ప్రపంచవ్యాప్తంగా సుమారు 130కోట్ల మంది ఫేస్‌బుక్ మెసెంజర్‌ యాప్‌ను వాడుతున్నట్లు సమాచారం. వారి సౌలభ్యం కోసం కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇతర మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే తమ యాప్ ప్రత్యేకంగా ఉండేలా కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నట్లు సదరు యాజమాన్యం తెలిపింది.