ప్రస్తుతం చిన్న సినిమాల హావా నడుస్తుంది. విస్మయ శ్రీ రిష్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. ఒక డిఫరెంట్ యాంగిల్ లో లవ్ స్టోరీతో.. సరికొత్త కథ కథనంతో గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా శ్రీ తేజస్ ప్రొడక్షన్ నిర్మించబడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్ట్ ప్రొడకషన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించటంతో పాటు ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ తో ప్రేక్షకులను తనవైపు లాగేసారు. ఇప్పటి వరకు విడుదలైన సినిమా రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. హీరో హీరోయిన్స్ ఇద్దరు కొత్తవారు అవ్వటం మరియు ప్రేమ కథ కావటంతో యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. 


ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కామెడీ, రొమాన్స్, యాక్షన్ వంటి ఎంటర్టైనర్ జానర్ లను కూడా కవర్ చేయనున్నారు. పక్కా పల్లె టూరి వాతావరణం, యూత్ మనసును దోచే సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తుంది. విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో మ్యూజిక్ హైలెట్ అవనుందని మరియు సినిమాటో గ్రఫీకి కూడా మంచి మార్కులే పొందనున్నట్లు సమాచారం. 


Also Read: Nani 30 Glimpse: 'హాయ్ నాన్న'గా వచ్చేసిన నాని.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్..


ఈ సినిమాలో వినయ్ మహదేవ్,  సుజాత, స్వాతి పొలిచర్ల, రఘు వంటి ప్రమఖులు నటిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు.  వరికుప్పల యాదగిరి పాటలు రచించగా.. గురి చూసి ఒక్క్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ రంగంలోకి దిగిన ఈ సినిమా తన రేంజ్ చూపించటానికి రెడీగా ఉన్నాడు.


బ్యానర్ : శ్రీ తేజస్ ప్రొడక్షన్ 
నిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర రావు
కథ, కథనం, దర్శకత్వం : రాజేష్‌ దొండపాటి
ఎడిటర్ : సాయి బాబు తలారి
మ్యూజిక్ : సాబు వర్గీస్


Also Read: Kushi: 'ఖుషి' నుంచి మరో మెలొడీ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'ఆరాధ్య' పాట..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook