Farmula Car Racing In Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై జరుగుతున్న కారు రేసింగ్ ట్రయల్స్‌లో పెను ప్రమాదం తప్పింది. శనివారం తొలిసారిగా ఇండియా రేస్ రేసింగ్ లీక్ ట్రైలర్ ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలోనే ప్రసాద్ ఐమాక్స్ ఎదుట రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మ ఉన్నట్టుండి విరిగి రోడ్డుపై పడింది. అదే సమయంలో చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడిన మరుక్షణంలోనే ట్రాక్ పై దూసుకొచ్చిన ఫార్ములా రేసింగ్ కారు ఆ చెట్టు కొమ్మను బలంగా ఢీకొంది. ఊహించని పరిణామానికి ఖంగు తిన్న రేసర్ అతి కష్టం మీద రేసింగ్ కారును అదుపులోకి తీసుకొచ్చి కొంత దూరంలో ట్రాక్ పక్కన నిలిపేశాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అదృష్టవశాత్తుగా రేసర్ అప్రమత్తంగా ఉండి కారును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది కానీ లేదంటే ట్రయల్ రన్ ఊహించని విషాదం ఏదో చోటుచేసుకుని ఉండేదని ప్రత్యక్షసాక్షులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.  



 


2023లో ఫిబ్రవరి 11న జరగనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫార్ములా ఇ కారు రేసింగ్ పోటీల్లో భాగంగా శనివారం నాడే రేసింగ్ ట్రయల్స్ షురూ అయ్యాయి. హైదరాబాద్ లో ఫార్ములా రేసింగ్ జరగనుండటం ఇదే తొలిసారి కాగా.. అది కూడా ఏకంగా నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పై రోడ్లపై ఈ ఈవెంట్ జరగనుండటం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే, జనానికి ఇబ్బంది కలిగేలా ఈ ఫార్ములా రేసింగ్ ని నగరం నడిబొడ్డున నిర్వహించడాన్ని బీజేపి తప్పుపట్టింది. ఇంతకీ ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈవెంటా లేక ప్రైవేటుదా అని నిలదీసిన బీజేపి చీఫ్ బండి సంజయ్.. ఈ రేసింగ్ ని సిటీ రోడ్లపై కాకుండా నగర శివార్లలో నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు.