Gold Price Today 16 September 2022: భారత దేశంలోని మహిళలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన పసిడి ధరలకు ఈ వారంలో బ్రేక్ పడింది. ఈ వారం ఆరంభంలో 3 రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర.. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోంది. పసిడి ధర వరుసగా మూడోరోజు తగ్గింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,200లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 220 తగ్గింది. ఈ ధరలు శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,560గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,400గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,250గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,450గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,400గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,400గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200.. 24 క్యారెట్ల ధర రూ. 50,400గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,400 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. నేడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (సెప్టెంబర్ 16) దేశీయంగా కిలో వెండి ధర రూ. 57,000లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 600 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 57,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 61,100లుగా ఉంది. బెంగళూరులో రూ. 61,100గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61,100లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 61,100ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Horoscope Today: ఆ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ప్రమోషన్ వచ్చే అవకాశం!


Also Read: Mobile Banking Virus: మీ ఖాతాల్ని ఖాళీ చేసే కొత్త మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook