బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ తగ్గాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ భారీగా ధర పతనమైంది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.440 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,410కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,050కి దిగొచ్చింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) మిశ్రమంగా ఉన్నాయి. తాజాగా బంగారం ధర రూ.510 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,860కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ. 500 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,900కి పడిపోయింది. 



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా దిగొచ్చింది. తాజాగా వెండి ధర రూ.1,800 మేర భారీగా పతనమైంది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.60,200 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe