న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు, దిగువ మధ్య తరగతికి చెందిన ప్రజలకు ప్రధాన మంత్రి జన్‌ ధన్ ఖాతా కలిగిన మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. రెండో విడతగా రూ.500 జమ చేసేందుకు బ్యాంకులన్నీ కార్యాచరణను మొదలుపెట్టాయి. ఫైనాన్షియల్ సేవల విభాగం నిర్ణయించిన మే నెలలోని ఉపసంహరణ ప్రణాళిక ప్రకారం ఈ డబ్బు జమ కానుందని, మహిళల జన్ ధన్ అకౌంట్‌ నంబర్‌లో చివరి నంబరు 0,1తో ముగుస్తాయో వారి అకౌంట్లలో సోమవారం జమ కానుందని బ్యాంకులు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం


అంతేకాకుండా అదే రోజు వారి అకౌంట్‌ నుంచి తీసుకోవచ్చని తెలిపింది. అకౌంట్‌ చివర 2, 3 నంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 5వ తేదీన 4,5 నంబర్లతో అకౌంట్‌ ఉన్న వారు మే 6వ తేదీన నగదు ఉపసంహరణ చేసుకోవచ్చని అలాగే అకౌంట్‌ చివరన 6, 7 నంబర్లు ఉన్న వారు మే 8వ తేదీన, 8, 9 నంబర్లతో ముగిసే అకౌంట్‌ నంబర్‌ ఉన్న వారు మే 11వ తేదీన చేసుకోవచ్చని తెలిపింది. 
 
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా ఎన్డీఏ సర్కార్ మూడు నెలల పాటు ప్రధాన మంత్రి జన్‌ధన్‌ ఖాతా దారులందరి అకౌంట్‌లలో రూ. 500 చొప్పున జమచేయనుందని, ఇప్పటికే గత నెల తొలి విడత ముగియగా రెండో విడతగా మే 4వ తేదీన జమ చేయనున్నట్లు బ్యాంకింగ్ సెక్రటరీ దేబాశిష్ పాండా శనివారం పేర్కొన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..