h3n2 Influenza Virus Symptoms: అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో H3N2 వైరస్ ఒక్కటి.  H3N2 వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫ్లుఎంజా కేసులలో భారతదేశం వేగంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. H3N2తో సహా వివిధ రకాల ఇన్‌ఫ్లుఎంజాలకు సంబంధించిన కేసులు భారత్‌ వ్యాప్తంగా  3,038పైగా నమోదయ్యాయని నిపుణులు ధృవీకరించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 కేసులు నమోదయ్యాయి. సీజనల్ ఇన్ఫ్లుఎంజా సబ్టైప్ H3N2 కారణంగా ఇద్దరు మరణించారు. ఈ వైరస్‌ కారణంగా శ్వాసకోశ వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం H3N2 ఫ్లూ లక్షణాలు ఉంటే తప్పకుండా తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మాస్క్‌ను కూడా ధరించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

H3N2 ఇన్ఫ్లుఎంజా బాధపడుతున్నవారు తప్పకుండా ఈ ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది:


  • సమతుల్య ఆహారం ప్రతి రోజూ తీసుకుంటే ఈ H3N2 ఇన్ఫ్లుఎంజా సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

  • ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకున్న ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. కనీసం కిలో శరీర బరువుకు 0.8 నుండి 1 గ్రా ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • H3N2 ఇన్ఫ్లుఎంజా రికవరీ కోసం తప్పకుండా పాల ఉత్పత్తులు, పనీర్, సోయా, టోఫు, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాల్సి ఉంటుంది.

  • విటమిన్లు & మినరల్స్ - యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటు పండ్లను ప్రతి రోజూ తీసుకోవాలి.

  • విటమిన్ ఎ కోసం క్యారెట్, బత్తాయి, బొప్పాయి, ఆప్రికాట్లు  

  • విటమిన్ సి కోసం నిమ్మ, ఉసిరి, టమోటాలు, నారింజ

  • విటమిన్ ఇ కోసం పొద్దుతిరుగుడు గింజలు, కుసుమ గింజలు, బాదం, పిస్తాపప్పులు తీసుకోవాల్సి ఉంటుంది.

  •  అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగిన తులసి, ఎండు అల్లం, నిమ్మరసం, వెల్లుల్లి, పసుపు తీసుకోవాల్సి ఉంటుంది.

  • కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్రీన్ టీతో గ్రీన్ టీతో సహా హైడ్రేషన్‌ డ్రింక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook