హనుమాన్ జయంతి.. హనుమాన్ భక్తులు అందరూ ఎంతో ఇష్టపడి, ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే హనుమాన్ జయంతి ఇవాళే. హనుమాన్ జయంతి వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుండే భక్తులు వేడుకలు ప్రారంభిస్తారనే సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8న బుధవారం నాడు హనుమాన్ జయంతి అనగా.. అంత కంటే కొన్ని రోజుల ముందు నుండే హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లతో ఎంతో సందడి నెలకొని ఉండేది. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తుల రాకతో కిక్కిరిసిపోయేవి. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున భక్తులు నిర్వహించే శోభాయాత్ర హనుమాన్ జయంతిని మరింత ప్రత్యేకం చేస్తుంది. కానీ ఈసారి కరోనా వైరస్ వ్యాపించకుండా దేశవ్యాప్తంగా లాక్ ఔట్ అమలు చేస్తున్న కారణంగా హనుమాన్ భక్తులు ఎవరి ఇళ్లకు వారే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సందర్భాల్లో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. సాధారణంగా అయితే, చైత్ర మాసం లేదా వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. అయితే, అదే హనుమాన్ జయంతిని మన కంటే దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ధనుర్మాసంలో జరుపుకుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : లేడీ ఫ్యాన్‌కి హార్ట్ సర్జరీ.. గొప్ప మనసు చాటుకున్న చిరు


వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సందర్భాల్లో హనుమాన్ జయంతిని నిర్వహించుకునే ఆనవాయితీ ఉన్నప్పటికీ చైత్ర పూర్ణిమ నాడు నిర్వహించే జయంతి వేడుకనే సిసలైన జయంతిగా భావిస్తారు. అలా ఈ ఏడాది చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 8న బుధవారం.. అంటే ఈరోజు దేశంలోని అనేత ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. అయితే, ఎప్పటిలా దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఎవరి ఇళ్లలో వాళ్లే ఆ శ్రీరామ భక్తుడిని పూజించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 


హనుమాన్ జయంతి పూజా టైమింగ్స్:
ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12:01 గంటలకే పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 8న ఉదయం 8:04 గంటల సమయానికి పూర్ణిమ తిథి ఘడియలు ముగుస్తుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..