Market Mahalakshmi: ఫ్యామిలీ ఎంటర్టైనర్ `మార్కెట్ మహాలక్ష్మీ`.. ఆ ఊహించని ట్విస్ట్‌తో మెస్మరైజ్
Market Mahalakshmi Review and Rating: మార్కెట్ మహాలక్ష్మీ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు కేరింత ఫేమ్ హీరో పార్వతీశం. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించగా.. అఖిలేష్ కలారు నిర్మించారు. శుక్రవారం నుంచి ఈ సినిమా థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టనుంది.
Market Mahalakshmi Review and Rating: కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా ప్రణీకాన్విక హీరోయిన్‌గా వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మార్కెట్ మహాలక్ష్మీ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అభిలేష్ కలారు నిర్మించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 19న థియేటర్స్‌లోకి రానున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రెస్ షో నిర్వహించారు. మార్కెట్ మహాలక్ష్మీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల రాబట్టగలదా..? పార్వతీశం ఆడియన్స్‌ను మెప్పించాడా..? రివ్యూలోకి వెళదాం పదండి.
కథ ఏంటంటే..?
ప్రభుత్వాఫీసులో గుమస్తాగా పనిచేస్తుంటాడు పార్వతీశం తండ్రి కేదార్ శంకర్. తన కుమారుడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను చేసి.. తాను పెట్టిన ఖర్చులకు వడ్డీతో సహా కట్నం రూపంలో వసూలు చేయాలని శంకర్ ప్లాన్ చేస్తాడు. అయితే పార్వతీశం కూరగాయల వ్యాపారం చేస్తున్న మహాలక్ష్మీ (ప్రణీకాన్విక)లో ప్రేమలో పడిపోతాడు. మహాలక్ష్మీ తండ్రి పక్షవాతంతో మంచానికే పరిమితై ఉంటాడు. అన్న క్వార్టర్ కృష్ణ (మహబూబ్ బాషా) మద్యానికి బానిస కావడంతో మహాలక్ష్మీ కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. ఆమె మాటలు అన్ని రెబల్‌గా ఉంటాయి. ప్రేమకు ఎక్కువ వాల్యూ ఇవ్వదు. ఇలాంటి అమ్మాయిని పార్వతీశం ప్రేమలో పడేశాడా..? తండ్రి మాటను కాదని మహాలక్ష్మీని పెళ్లి చేసుకున్నాడా..? ద్వితీయార్థంలో వచ్చే అసలైన ట్విస్ట్ ఏంటి..? అనేది ఈ సినిమా కథ.
ఎవరు ఎలా చేశారంటే..?
కేరింత సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు పార్వతీశం. ఈ మూవీలో తన బెస్ట్ యాక్టింగ్‌తో అలరించాడు. మహాలక్ష్మీ పాత్రలో హీరోయిన్ ప్రణికాన్విక ఒదిగిపోయింది. చురుకు, బెడుసు తనం చూపిస్తూనే హవాభావాలు చక్కగా పలికింది. ముక్కు అవినాష్ స్క్రీన్‌పై కాసేపే ఉన్నా.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తాగుబోతు పాత్రలో మహబూబ్ బాషా కొన్ని సీన్లలో తాగుబోతు రమేష్‌ను గుర్తు చేస్తాడు. కసక్ కస్తూరి పాత్ర పోషించిన పూజా విశ్వేశ్వర్ గుర్తిండిపోయేలా నటించింది. హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు.
విశ్లేషణ..
కుటుంబ విలువలను తెరపై చక్కగా చూపించారు దర్శకుడు వీఎఎస్ ముఖేష్. తండ్రికి డబ్బు మీద ఉన్న ఆశతో కట్నం కోసం ధనవంతుల అమ్మాయి చేసుకునే బదులు.. స్వతంత్రంగా బతికే ఆడపిల్లను చేసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా తను చూసుకుంటుందనే అమ్మాయిని చేసుకోవాలని ఆలోచించే హీరో కథే మార్కెట్ మహాలక్ష్మీ. తన స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ పొరపాటును తీసుకుని ముఖేష్ కథను రాశారు. తాను రాసుకున్న పాయింట్‌ను ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తీయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. డైలాగ్స్, కామెడీతో మెప్పించాడు. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు సాగతీత, సిల్లీగా అనిపిస్తాయి. 26 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. హర్ష వర్ధన్ పాత్ర ద్వారా హీరో క్యారెక్టర్‌కు గీతోపదేశం చేయిస్తాడు. ఓవరాల్‌గా తాను అనుకున్న పాయింట్‌ను చూపించడంలో డైరెక్టర్ ఎక్కడా తడబడలేదు. ఫస్టాఫ్ కాస్త పర్వాలేదనిపించినా.. సెకండాఫ్ బాగుంటుంది. సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ, జో ఎన్మవ్ మ్యూజిక్ పర్వాలేదనిస్తుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్లు ఉన్నాయి. కుటుంబ సమేతంగా చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
Also Read: Vitamin E: విటమిన్ ఇ అందరూ వాడకూడదా, ఎవరెవరు దూరంగా ఉండాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook