Income Tax Latet Update: ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు తాము సంపాదించే ప్రతి రూపాయికి ప్రభుత్వానికి లెక్కచూపాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చిన ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ మొదలవ్వగా.. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు తమ ఆదాయానికి సంబంధించి వివరాలు అందజేయాలి. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో కీలక విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెలలో జీతం పొందుతున్న ఉద్యోగులు.. వారి యజమానుల నుంచి ఫారం 16ని అందుకుంటారు. యజమాని ద్వారా ఉద్యోగి తరపున టీడీఎస్ వివరాలతో ఉంటుంది. ఫారమ్ 16లో టీడీఎస్‌తో పాటు యజమాని చెల్లించిన శాలరీ వివరణాత్మకంగా ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్ ప్రకటించిన సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను విధానంలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లో కూడా అనేక మార్పులు చేసినట్లు తెలిపారు. ఎవరైనా కొత్త పన్ను విధానంతో పన్ను దాఖలు చేస్తే.. రూ.7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందన్నారు.


ఫారమ్ 16లో పేర్కొన్న పాన్ నంబరు సరైనదేనని ధృవీకరించాలి. అలాగే మీ పేరు, చిరునామా, యజమాని టీఎఎన్‌, పాన్ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వివరాలు కచ్చితంగా కరెక్ట్‌గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సమస్యలు తప్పవు. 


మీ శాలరీ నుంచి కట్ అయిన ట్యాక్స్‌ను ఫారమ్ 16, ఫారమ్ 26ఏఎస్, AISలో తీసివేసిన ట్యాక్స్‌తో పోల్చుకోవాలి. ఎక్కడైనా తేడా కనిపిస్తే.. వెంటనే మీ యజమానికి సమాచారం అందించండి. ఫారమ్ 16లో అందించిన సమాచారాన్ని సరిదిద్దమని రిక్వెస్ట్ చేయండి. సరైన వివరాలు అందించి.. ఫారమ్ 26ఏఎస్, AISతో సరిపోల్చుకోండి.


Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..  


Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి