ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియో లాంచ్‌కి జూనియర్ ఎన్టీఆర్ ?
ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియో లాంచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న తారక్
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు యదార్ధగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ వేడుక కోసం సర్వం సిద్ధమవుతోంది. రేపు శనివారం హైదరాబాద్‌లోని జైఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ వేడుకను ఇంతకు ముందెప్పుడు కనివినీ ఎరగని రీతిలో ఘనంగా జరిపేందుకు బాలయ్య బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతోపాటు ఆ కుటుంబం నుంచే బాలయ్య బాబు, కల్యాణ్ రామ్ వంటి స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ఆడియో లాంచ్ వేడుకకు యావత్ నందమూరి కుటుంబం మొత్తం హాజరు కానున్నట్టు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఆడియో లాంచ్ వేడుకలో యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ హాజరవడమే కాకుండా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని తెలుస్తోంది.
నటనలో తాతగారి పోలికలు అన్ని పునికిపుచ్చుకుని, ఆయనలాగే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ అంటే ఇష్టపడని నందమూరి అభిమానులు ఎవరుంటారు ! అందుకే ఆయన రాక కచ్చితంగా అక్కడ ప్రత్యేకమే అవుతుందంటున్నారు అభిమానులు.
ఎన్టీఆర్‌తో పాటు తెలుగు సినిమాల్లో హీరోలుగా వెలిగిన ఆనాటి సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, అలనాటి అందాల తారలు జమున, గీతాంజలి వంటి సెలబ్రిటీలు ఈ వేడుకకు అతిథులుగా రానున్నారు. ఈమేరకు వారిని బాలయ్య బాబు స్వయంగా ఆహ్వానించినట్టు సమాచారం.