రాత్రే కాదు.. పగలు కూడా సెక్స్ చేస్తాం కదా..!
ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ది పర్సనల్ ఈజ్ పొలిటికల్` అనే అంశంపై ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2018లో వారు పైవిధంగా స్పందించారు.
ప్రముఖ దక్షిణాది సినీతారలు కాజల్ అగర్వాల్, తాప్సీ పన్నూ, ఖుష్బు సుందర్ మరియు గౌతమిలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు టీవీల్లో కండోమ్ ప్రకటనలపై నిషేధం విధించడంపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ది పర్సనల్ ఈజ్ పొలిటికల్' అనే అంశంపై ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2018లో వారు పైవిధంగా స్పందించారు.
"మన జనాభాను నియంత్రించాలనుకుంటే, మనము కండోమ్ ప్రకటనలను చూపించాలి" అని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. తాప్సీ కూడా కాజల్ అన్నమాటకి జై కొట్టింది. దేశంలో అధిక జనాభా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలను వేస్తే తప్పేమి లేదని అన్నారు. నటి, రాజకీయవేత్త ఖుష్బు సుందర్ "రాత్రి 11 తర్వాత మాత్రమే మీరు కండోమ్ ప్రకటనలను టీవీల్లో ప్రసారం చేస్తారనటం హాస్యాస్పదంగా ఉంది. సెక్స్ రాత్రి మాత్రమే కాదు.. పగలు కూడా చేస్తారు కదా" అని చెప్పారు. గౌతమి 'సంతానోత్పత్తి', 'సురక్షిత సెక్స్' అంశాలను ప్రస్తావిస్తూ.. టీవీల్లో కండోమ్ నిషేధాన్ని వ్యతిరేకించారు.