కవచం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు వేదికపైనే అందరి ముందు గట్టిగా ముద్దు పెట్టుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అటు పరిశ్రమవర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో ఈ కిస్సింగ్ వివాదం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో పనిచేస్తోన్న చోటా కే నాయుడు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు కానీ ఈసారి కాజల్ అగర్వాల్‌ని ముద్దు పెట్టుకోకుండా ఎందుకు ఉండలేకపోయాడు అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరిగాయి. తాను కాజల్ ను ముద్దు పెట్టుకున్న వైనం ఓ వివాదంగా మారడంపై ఆఖరికి చోటా కే నాయుడు కూడా స్పందించాల్సి వచ్చింది.


అయితే, ఈ వివాదంపై ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ ఎందుకు స్పందించలేదబ్బా అని సందేహాలు వ్యక్తంచేస్తున్న వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఎట్టకేలకు ఆమె కిస్సింగ్ కాంట్రవర్శిపై పెదవి విప్పింది. కవచం ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. చోటా కే నాయుడు ఉన్నట్టుండి తనను ముద్దుపెట్టుకున్నప్పుడు తాను కూడా షాక్ అయ్యానని వెల్లడించింది. చోటా కే నాయుడు తనకు చాలా కాలంగా తెలుసని, ఆయన తనతో ఏనాడూ చెడుగా ప్రవర్తించలేదన్న కాజల్.. అసలు ఆయనకు అటువంటి ఉద్దేశాలు కూడా లేవని చెప్పుకొచ్చింది. అదే రోజు వేదిక దిగిన వెంటనే తన వద్దకొచ్చిన చోటా కే నాయుడు.. తన ప్రవర్తన ఇబ్బంది పెట్టి వుంటే క్షమించు నాన్నా అని అడిగారని ఆరోజు జరిగిన విషయాన్ని కాజల్ బహిర్గతం చేసింది.