Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్.. అదిరిపోయే లిరిక్స్ అందించిన చంద్రబోస్
Kaliyugam Pattanamlo Title Song: కలియుగం పట్టణంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో అంచనాలు నెలకొనగా.. తాజాగా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందరినీ ఆలోచింపజేసేలా ఆయన లిరిక్స్ అందించారు.
Kaliyugam Pattanamlo Title Song: అన్ని వర్గాలను ఆకట్టుకునేలా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘కలియుగం పట్టణంలో’ మూవీ తెరకెక్కుతోంది. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్స్‌గా నటించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మిస్తుండగా.. అతి త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. చిత్రా శుక్లా ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌తో మంచి క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటను రచించగా.. ఆడియన్స్‌ను ఆలోచింపజేసేలా ఉంది. కలి ప్రభావం, కలియుగం ఎలా ఉందో ఆయన ఈ పాట చక్కగా వివరించారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన 'నీ వలనే', 'జో జో లాలీ అమ్మ' సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మదర్ సెంటిమెంట్, లవ్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్‌ను చంద్రబోస్ అదిరిపోయేలా రాశారు. అజయ్ అరసాద క్యాచీగా బాణీలు అందించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. విడుదల తేదీని మూవీ మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో మూవీ రాలేదని అంటున్నారు. సరికొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించామని.. మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా అలరిస్తుందన్నారు.
Also Read: Amitabh Bachchan: సినీ పరిశ్రమలో కలవరం.. ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
==> నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా తదితరులు
==> బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
==> ప్రొడ్యూసర్స్: డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
==> డైరెక్టర్స్: రమాకాంత్ రెడ్డి
==> మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అరసాడ
==> కెమెరామెన్ : చరణ్ మాధవనేని
==> సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
==> ఎడిటర్ : గ్యారీ బీహెచ్
==> PRO: సాయి సతీష్, రాంబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter