కొరియోగ్రాఫర్ రాణించిన రాఘవ లారెన్స్‌ సొంతంగా డైరెక్ట్ చేసుకుంటూ హీరోగా నటిస్తున్న హర్రర్‌, కామెడీ చిత్రాలు వరుస విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. 2007లో ‘ముని’తో వచ్చిన లారెన్స్ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత వచ్చిన ముని సీక్వెల్స్ కాంచన, కాంచన2 కూడా విజయవంతమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లారెన్స్  ఇప్పుడు ‘కాంచన 3(ముని 4)’లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మరింత భయపెట్టేందుకు, నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో ఓవియా కథానాయిక. ‘బిగ్‌బాస్‌’లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఓవియా నటిస్తున్న మొదటి సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబరు 21న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారని తెలిసింది.


కాంచన3లో లారెన్స్‌, ఓవియాలతోపాటు వేదిక, కోవై సరళ, మనోబాలా, శ్రీమన్‌, దేవదర్షిణి తదితరులు నటిస్తుండగా.. తమన్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ముని, కాంచన, కాంచన2 చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా కూడా హర్రర్‌, హాస్య సన్నివేశాలు ఉంటాయని మూవీ యూనిట్  చెబుతోంది.