సౌత్‌లో సంచలన సృష్టించిన అర్జన్ రెడ్డిని ..కబీర్ సింగ్ మార్చిన బాలీవుడ్ మేకర్స్....ఇప్పుడు కామ్రేడ్ పై పడ్డారు...అదేనండి... డియర్ కామ్రేడ్ ను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ రెడ్డి స్పూర్తితో.....


బాలీవుడ్ నిర్మాతల కన్ను మరో సారి విజయ్ దేవరకొండ మూవీపై పడింది. అర్జున్ రెడ్డిని ..కాస్త కబీర్ సింగ్ గా ప్రేక్షకులకు పరిచయం చేసిన బాలీవుడ్ మేకర్స్..ఇప్పుడు సౌత్ లో  డియర్ కామ్రేడ్ కు వస్తున్న రెస్సాన్స్ ఫిదా అవుతున్నారట. ఈ మూవీని సినిమాకు రీమేక్ ఫిక్స్ చేసి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.బాలీవుడ్ వర్గాల నుంచి అందిచన సమాచారం ప్రకారం డియర్ కామ్రేడ్ మూవీని హిందీలో రీమేక్ చేయాలని దర్శక నిర్మాత కరణ్ జోహార్ డిసైడ్ అయ్యాడట . విడుదలకు ముందే ఈ సినిమా చూసి హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న కరణ్.. ఇప్పుడు స్క్రీన్ ప్లేకు మార్పులు చేసే పనిలో పడ్డాడు.


చిన్నపాటి మార్పులతో రిమేక్..


విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు మిక్స్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ పరంగా చూసినట్లయితే బాబి (విజయ్ దేవరకొండ) స్టోరీగా తెరకెక్కింది. స్టోరీలో వెళ్లే సరికి ఇందులో లిల్లీ (రష్మిక)ది బలమైన పాత్ర. నిజానికి సెకెండాఫ్ మొత్తం ఈమెదే. లిల్లీ పాత్ర చుట్టూ ఉన్న మీ-టూ కాన్సెప్ట్ కరణ్ ను ఎట్రాక్ట్ చేసింది. అందుకే ఈ సినిమాను ఫిమేల్ సెంట్రిక్ మూవీగా మార్చే పని స్టార్ట్ చేశాడు కరణ్. అంటే బాలీవుడ్ వెర్షన్ లో బాబి పాత్ర కంటే లిల్లీ పాత్ర పవర్ ఫుల్ గా కనిపిస్తుందన్నమాట. స్క్రిప్ట్ లో మార్పుచేర్పుల కోసం రైటర్స్ టీమ్ ను ఏర్పాటుచేసిన కరణ్… తను అనుకున్న విధంగా స్క్రిప్ట్ రెడీ అయితే సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తాడు.