రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో ప్రదాన పాత్రలైన చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రలపై క్లారిటీ వచ్చింది. వారి పాత్రల్లో నటించేది ఎవరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలతో  తేలిపోయింది. లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞా శెట్టి  కనిపించనున్నట్లు ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




 


అదే సమయంలో ఈ సినిమాలో  చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా ..ముఖ్యపాత్ర అంటూ కామెంట్ చేశారు.


 




ఇప్పటికే ఓ మూవీకి సంబంధించిన  వివాదాస్పద ' వెన్నుపోటు' పాట విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వివాదానికి కేంద్రంగా మారిన ఈ మూవీ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.