Lemon Seeds For Liver Detox: మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాకుండా ఎంతో యాక్టివ్ గా పనులు చేసేవారు. వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా వారి పనులను ఎంతో చక్కగా చేసుకునేవారు. అప్పటితో ఇప్పుడు పోల్చుకొని చూస్తే ఇప్పుడంతా విభిన్నంగా ఉంది. ప్రస్తుతం యువత కూడా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నీకు ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలిని అనుసరించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం కారణంగా టాక్సిన్స్ పేరుకు పోతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మద్యపానం సేవించడం వల్ల ఇలాంటి సమస్యలు అధికమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఈ టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పాలు చిట్కాలు పాటించాలి.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


శరీరంలో లివర్ ఒక్కసారి దెబ్బతింటే అది జీవితాంతం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఇంతవరకు ఇలాంటి సమస్యల బారిన పడినవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు సూచించిన నిమ్మకాయలో ఉండే గింజలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు నిమ్మకాయ గింజలను నమిలి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఫ్లేవ‌నాయిడ్స్, ఆల్క‌లాయిడ్స్‌ లభిస్తాయి. మద్యం సేవించడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు లివర్ పై పడకుండా సంరక్షిస్తాయి.


తరచుగా మద్యం సేవించేవారు ఈ నిమ్మకాయ గింజలను ప్రతి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ప్రస్తుతం చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నిమ్మకాయ రసం తో పాటు గింజలను కలుపుకొని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అన్ని రకాల వ్యర్ధపదార్థాలను బయటకు పంపించేందుకు సహాయపడతాయి.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి