Mahesh Babu and Namratha Birthday wishes to Sithara: మన హీరోలు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒకపక్క సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి కావాల్సిన టైం వాళ్ళు కేటాయిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు తన కుమారుడికి, కుమార్తెకు అవసరమైన టైం కేటాయిస్తూ వారిని ఎప్పటికప్పుడు మంచి తండ్రిలా చూసుకుంటూ ఉంటారు. గౌతమ్ కంటే కూడా ఆయన కుమార్తె సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఆమె ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది.  ఆమె పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అటు మహేష్ బాబు ఇటు నమ్రత కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఏమీ తెలియకుండానే పదేళ్లు గడిచిపోయాయి, నా జీవితంలో మిరుమిట్లు గొలిపేలా తారలా వచ్చిన నా కుమార్తె సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు.  ఇక నమ్రత కూడా ఒక సుదీర్ఘ మెసేజ్ పోస్ట్ చేశారు.


ఇక మీదట చిన్ని తల్లి కానీ నా చిన్ని తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె పేర్కొన్నారు.  నీ చిన్ని ఆటలు, అల్లరి చేష్టలు, బోరింగ్‌ బెడ్‌ స్టోరీస్‌ అన్నింటిని లవ్ చేస్తున్నానని ఆమె పేర్కొంది. ఇవి వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. కొత్త దశలోకి అడుగుపెడుతున్న నీకు నా లవ్ అండ్ హగ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయని ఆమె పేర్కొంది. ఇంకా నువ్వు కనుగొన వలసినవి, నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్న నమ్రత నీ మనసులో అనుకున్న ఏ లక్ష్యాన్ని అయినా కచ్చితంగా సాధించగలవని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.


లవ్‌ యూ పప్లూ అని నమ్రత ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒక పక్క తన చదువు కంటిన్యూ చేస్తూనే మరోపక్క వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Also Read: Ileana D'cruz: బికినీతో కాక రేపిన ఇలియానా డిక్రూజ్.. అందాలన్నీ కనిపించే విధంగా!


Also Read: Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook