Mahesh Babu Mother Indira Devi Passed Away: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్య కారణాలతో మృతిచెందగా ఇప్పుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ ముందుగా తనకు మేనకోడలు వరసయ్యే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, పద్మావతి వీరిలో రమేష్ బాబు సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నీ కాలం కలిసి రాకపోవడంతో తర్వాత నిర్మాతగా కొనసాగే ప్రయత్నం చేశారు. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎలాంటి క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముగ్గురు కుమార్తెలలో ఒకరు గల్లా జయదేవ్ ని వివాహం చేసుకోగా మరొకరు సంజయ్ స్వరూప్ అనే నటుడిని వివాహ మాడారు.


ఇక ప్రియదర్శిని నటుడు సుధీర్ బాబును వివాహమాడారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఏఐజీ హాస్పిటల్లో సుమారు నెలరోజుల నుంచి ఆమె అనారోగ్య రీత్యా చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే వయోభారం రీత్యా ఏర్పడిన పలు అనారోగ్య కారణాలతో ఆమె ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూసినట్లు తెలుస్తోంది.


దీంతో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణ రెండో భార్య విజయనిర్మల కూడా ఈ మధ్యనే కాలం చేయడంతో కృష్ణ చాలా కృంగిపోయారు. ఆయన ఎక్కువగా బయటకు కూడా రావడం లేదు. ఇప్పుడు తనకు మేనకోడలు వరుసయ్యే మొదటి భార్య ఇందిరాదేవి కూడా కన్నుమూయడంతో ఆయన మరింత కృంగిపోతారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతానికి ఆమె అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయాల మీద ఎలాంటి క్లారిటీ లేదు.


ఈ విషయం మీద మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. నిజానికి మహేష్ బాబుకు ఇందిరా దేవి అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మహేష్ బాబు బయట పెడుతూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు స్వయానా కన్నతల్లి కన్నుమూయడంతో మహేష్ బాబు మాత్రం తీవ్రో విషాదంలో మునిగిపోయారని చెప్పక తప్పదు.


Also Read : Jabardasth Comedian Murthy: జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి.. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోనే!


Also Read: Manchu Vishnu Trolling : 85% ట్రోలింగ్ ఆ నటుడి ఇంటి నుంచే.. మంచు విష్ణు సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook