గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు నిత్యం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు ( SP Balu ) కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తాజాగా టాలీవుడ్‌ సుపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ( Mahesh Babu ) కూడా ఓ ట్వీట్ చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్‌.. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి తగిన స్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read : Rhea Chakraborty: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఆగస్టు 5న జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో అప్పటి నుంచే చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బాలు ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఆయనకు ఐసియులో వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో ( ECMO ) సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గాన గంధర్వుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్వీట్ చేశారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా తెరకెక్కుతోంది. Also read : SBI ATM: మనీ కోసం ఇక ఏటీఎంకి కూడా వెళ్లక్కర్లేదు