Buy Maruti Brezza CNG under 10 Lakhs: మారుతి సుజికీ సంస్థ బ్రెజా సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఆటో ఎక్స్‌పో 2023లో అధికారికంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు సీఎన్‌జీతో అందించబడిన మొదటి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు (Maruti Suzuki Brezza CNG) ధర రూ. 9.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్రెజా సీఎన్‌జీ నాలుగు వేరియంట్లలో (LXI, VXI, ZXI మరియు ZXI డ్యూయల్ టోన్) అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే.. బ్రెజా సీఎన్‌జీ కోసం 95 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki Brezza CNG Launch: 
మారుతి సుజికీ కంపెనీకి చెందిన 13వ మోడల్ బ్రెజా సీఎన్‌జీ. ఇది సీఎన్‌జీతో మార్కెట్లోకి వచ్చింది. ఇంతకుముందు ఆల్టో 800, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో స్పోర్ట్స్, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6 మరియు ఎర్టిగాలో కూడా సీఎన్‌జీ అందించబడింది. సీఎన్‌జీ కిట్‌తో అమర్చబడిన 1.5L డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్‌ను మారుతి సుజికీ బ్రెజా కలిగి ఉంటుంది.


Maruti Suzuki Brezza CNG Features:
మారుతి సుజికీ బ్రెజా సీఎన్‌జీ ఇంజన్ గరిష్టంగా 5500rpm వద్ద 86.6 bhp శక్తిని మరియు 121.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 25.51 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ ఆప్షన్ లేనప్పటికీ ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్ మోడల్‌లో ఉన్న ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారు యొక్క టాప్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ పుష్ స్టార్ట్ ఫీచర్లు ఉన్నాయి.


Maruti Suzuki Brezza CNG Bookings:
సీఎన్‌జీ వెర్షన్ ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఫ్యూయల్ క్యాప్, సీఎన్‌జీ డ్రైవ్ మోడ్, డిజిటల్ మరియు అనలాగ్ సీఎన్‌జీ ఫ్యూయల్ గేజ్‌ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లు బ్రెజా సీఎన్‌జీలో ఉన్నాయి. మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇది టాటా నెక్సాన్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో పోటీపడుతుంది. 2023 ఫిబ్రవరిలో మారుతి బ్రెజా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలిచింది. ఇప్పుడు సీఎన్‌జీ కూడా రావడంతో ఇతర కంపెనీల అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. 


Also Read: IND vs AUS 3rd ODI Tickets: భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే.. టికెట్స్ కోసం ఫాన్స్ బారులు! దుప్పట్లు కప్పుకుని క్యూ లైన్‌లోనే కునుకు  


Also Read: Suryakumar Yadav Trolls: పరుగులు చేయకున్నా సూర్యకుమార్‌కే ఛాన్సులు.. సంజూ శాంసన్ ఏం పాపం చేశాడు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.