రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో సైరా నరసింహారెడ్డి !
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు టాక్. మెగాస్టార్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీగా గుర్తింపు లభించనుంది. కాగా మూవీ ఒక్క షెడ్యూల్ కోసమే 40 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంతో తీస్తున్న సినిమాపై చిత్ర యూనిట్ కు భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారు. అది కూడా నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో షూట్ చేస్తున్న ఈ షెడ్యూల్ కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఇది. తన సైన్యంతో కలిసి నరసింహారెడ్డి, బ్రిటిష్ వాళ్లపై దండెత్తే ఎపిసోడ్ ఇది.