ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ సింగర్ మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ సింగర్ మృతి
ప్రముఖ మలయాళీ గాయకుడు, సంగీత విద్వాంసుడు బాలభాస్కర్(40) కన్నుమూశారు. సెప్టెంబర్ 25న కుటుంబంతో కలిసి గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని తిరిగి వస్తుండగా ఆయన కారు తిరువనంతపురం శివార్లలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కుమార్తె తేజస్వీ అక్కడికక్కడే మరణించగా.. భాస్కర్, ఆయన భార్య, డైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన రోజు నుండి నేటి వరకు బాలబాస్కర్ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయోలినిస్ట్‌గా పండిట్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, శివమణి, హరిహరన్, ఫాజల్ ఖురేషి ప్రముఖులతో ఆయన పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టేజ్ షోలతో బాలభాస్కర్ అభిమానులను సంపాదించుకున్నారు.
కాగా బాలభాస్కర్ మృతిపై మాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అభిమానుల సందర్శనార్ధం బాలభాస్కర్ భౌతికకాయాన్ని ఆయన చదువుకున్న తిరువనంతపురం కాలేజీకి తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
పిన్న వయసులోనే కర్నాటక సంప్రదాయంలో పట్టు సాధించిన బాలభాస్కర్.. మాంగళ్యప్పల్లక్, పంచజన్యమ్, పట్టింటే పాలాజి, మోక్షం, కన్నడిక్కాదవత్ తదితర అనేక చిత్రాలకు సంగీతం అందించారు. నినక్కాయ్, ఆద్యమై ఆల్బమ్‌లు గొప్ప ప్రేక్షాదరణను పొందాయి.