ఇండస్ట్రీ కోసం కాదు, వారి స్వార్థం కోసం: అగ్గి రాజేస్తున్న బాలకృష్ణ
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటానని’ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna Comments) సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: సినిమా షూటింగ్స్ పునరుద్ధరణ కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ నెల 9న కలవనున్నామని, అయితే నటుడు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించినట్లు సినీ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. అయితే మరుసటిరోజు తన పుట్టినరోజు ఏర్పాట్ల కారణంగా రాలేకపోతున్నానని బాలయ్య చెప్పినట్లు సైతం నిర్మాత వెల్లడించారు. కానీ అంతలోనే బాలకృష్ణ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. Actors Commit Suicide: షూటింగ్స్ లేక ఆర్థిక సమస్యలతో అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా Tollywood ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటాను. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ లెజెండ్. ఆయన నాన్నగారికి ప్రియ శిష్యుడు. అందుకే ఆయన కుమారుడికి నాన్నగారి పేరు పెట్టుకున్నారు. జన్మభూమి పథకం పేరును ఆయనే సూచించారు. లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’ని చూశారా!
ఇప్పటివరకూ ఇండస్ట్రీ నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే నన్ను కలిశాడు. స్వార్థం ఉన్నంత వరకు వివాదం సద్దు మనగదు. స్టూడియోల కోసమే కొందరు ఈ తతంగం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్నది కొందరి స్వార్థం కోసమే తప్ప ఇండస్ట్రీ కోసం కాదు. ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవకపోయినా వస్తాను. ఇప్పుడు మళ్లీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టాలీవుడ్ నుంచి కొందరు కలుస్తారంట. దీనిపై నాకైతే ఏ సమాచారం లేదంటూ’ సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) షాకింగ్ విషయాలు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్