Nayanthara fans fires on Karan Johar: కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఆయన తెలుగులో సినిమాలు చేయకపోయినా తన కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా చాలామందికి ఆయన పరిచయమే. ఇక ఆయన చేసిన మొట్ట మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆయన లైగర్ అనే సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ముందుకు త్వరలోనే రాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. తద్వారా తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తన భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టుతో రాబోతున్నారు. అయితే ఇప్పుడు కరణ్ జోహార్ అనూహ్యంగా నయనతార అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సమంత అక్షయ్ కుమార్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు.


ప్రస్తుతానికి కాఫీ విత్ కరణ్  ఏడవ సీజన్ జరుగుతుండగా అందులో మూడవ ఎపిసోడ్ లోనే సమంత -అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతను సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అని కరణ్ జోహార్ ప్రశ్నించారు. దానికి సమంత ఆసక్తికరంగా స్పందిస్తూ నేను ఇటీవల నయనతారతో కలిసి ఒక ప్రాజెక్టు చేశాను ఆ ప్రాజెక్ట్ చివరి రోజు ఆమె ఎమోషనల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. దానికి కరణ్ జోహార్ స్పందిస్తూ ఓకే అవునా నాట్ ఇన్ మై లిస్ట్ అంటే నా లిస్టులో ఆమె లేదు అంటూ కామెంట్ చేశాడు.


అయితే ఆయన ఎందుకలా కామెంట్ చేశాడో తెలియదు కానీ సౌత్ లో ఒక స్టార్ హీరోయిన్ అయిన నయనతారను పట్టుకుని అలా మాట్లాడడం ఏమిటి అంటూ ఇప్పుడు నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అలా పక్షపాతం చూపిస్తున్నారు? నయనతార స్టార్ హీరోయిన్ అని ఒప్పుకోవడానికి మీకేంటి ఇబ్బంది? అంటూ ఆమె అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనికి కరణ్ జోహార్ స్పందిస్తారేమో చూడాలి మరి. 


Read Also: Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?


Read Also: Sravana Bhargavi: ఎట్టకేలకు వెనక్కు తగ్గిన శ్రావణ భార్గవి.. డిలీట్ చేయనంటూనే డిలీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook