`భరత్ అనే నేను` మూవీకి కొత్త సన్నివేశాలు
`భరత్ అనే నేను` మూవీ ఏప్రిల్ 20న విడుదలై అందరి ప్రసంశలు అందుకుంటోంది.
'భరత్ అనే నేను' మూవీ ఏప్రిల్ 20న విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు- కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా.. ఈ మూవీకి త్వరలో కొత్త సన్నివేశాలను కలపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడిన డైరెక్టర్ కొరటాల శివ ఫైనల్ ఎడిటింగ్ సమయంలో నిడివి కారణంగా కొన్ని మంచి సన్నివేశాలను తొలగించామని, వాటిని త్వరలోనే జత చేస్తున్నామని అన్నారు. దీంతో ఆయా సీన్‌లకు డబ్బింగ్ కార్యక్రమాలను యూనిట్ చేపట్టింది. అయితే ఈ సన్నివేశాలను ఎప్పటి నుంచి జత చేస్తారనే విషయాన్ని నిర్మాతలు చెప్పలేదు.
కేవలం 3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ‘భరత్ అనే నేను’. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్‌లోనూ అదే రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. కాగా, సోమవారం జరిగిన సక్సెస్ మీట్ తరవాత తిరుపతిలో ఏప్రిల్ 27న మరో సక్సెస్ మీట్‌ని ప్లాన్ చేస్తుంది ‘భరత్ అనే నేను’ టీమ్.