చావడానికి సమయం లేదు మిత్రమా..!!
జేమ్స్ బాండ్... హాలీవుడ్ లో ఈ సిరీస్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ చిత్రాలు డబ్బింగ్ అవుతాయి. హాలీవుడ్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులను అలరిస్తాయి. తాజాగా జేమ్స్ బాండ్ చిత్రం మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. No Time to Die పేరుతో వస్తున్న జేమ్స్ బాండ్ చిత్రం ట్రెయిలర్ ఇప్పటికే విడుదలై దుమ్మురేపుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడో ట్రెయిలర్ రిలీజ్ చేశారు. జేమ్స్ బాండ్ గా ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ నటిస్తున్నారు. ఇదే ఆయన చివరి చిత్రం కానుంది. ఈ క్రమంలో జేమ్స్ బాండ్ సినిమాపై హాలీవుడ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. సినిమాలో జేమ్స్ బాండ్ పాత్రను చంపేస్తారా..? లేదా అతనికి రిటైర్మెంట్ ఇస్తారా..? లేదా అతను చనిపోవడాన్ని ఫేక్ అని చూపిస్తారా..? ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల్లో రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఏం చూపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
No Time to Die జేమ్స్ బాండ్ చిత్రానికి క్యారీ జోజి ఫుకునగ దర్శకత్వం వహించారు. గతంలో ఉన్న జేమ్స్ బాండ్ చిత్రాల్లాగే దీన్ని కూడా అత్యంత ఉత్కంఠగా రూపొందించామని ఆయన చెప్పుకొచ్చారు. అమ్మాయిలతో జేమ్స్ బాండ్ రిలేషన్షిప్స్, ఆయన యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా కనిపిస్తాయని తెలిపారు. యూనివర్శల్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో థియేటర్లలో అలరించనుంది.