O Thandri Teerpu: `ఓ తండ్రి తీర్పు’ ఎలా ఉండబోతుంది..? ఈ నెల 27న రిలీజ్
O Thandri Teerpu Movie: కుటుంబ విలువలు నేటి సమాజానికి చాటి చెప్పేలా ఓ తండ్రి తీర్పు అనే మూవీ తెరకెక్కింది. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించగా.. వివ రెడ్డి హీరోగా నటించారు. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది.
O Thandri Teerpu Movie: వివ రెడ్డి హీరోగా ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓ తండ్రి తీర్పు. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్‌పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మించారు. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచనతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 27న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కుటుంబ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో ఆస్తుల కోసం తల్లిదండ్రులను ఎంత క్షోభకు గురి చేస్తున్నారో మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. ఆస్తులపై ఉన్న ప్రేమ.. కన్న తల్లిదండ్రులపై లేకపోతే ఎలా ఉంటుందో అనే పాయింట్‌తో రూపొందించారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. హీరో వివ రెడ్డి చేస్తున్న పాత్ర చాలా బాగుంటుందని తెలిపారు. చాలామంది కొడుకులకు ఈ పాత్ర కనువిప్పు కలిగించేలా ఉంటుందన్నారు. ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉందని ప్రొడ్యూసర్ శ్రీరామ్ దత్తి తెలిపారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని కోరారు. రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్, కునాల్, కుషాల్, చిత్రం బాషా, అనురాధ, జబర్దస్త్ నాగరాజు, రారాజు, సురభి శ్రావణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నీకల్ టీమ్:
==> ప్రొడ్యూసర్: లయన్ శ్రీరాం దత్తి
==> డైరెక్షన్: ప్రతాప్ భీమవరపు
==> రైటింగ్, దర్శకత్వ పర్యవేక్షణ: రాజేంద్రరాజు కాంచనపల్లి
==> సినిమాటోగ్రఫీ: సురేష్ చెటిపల్లి
==> మ్యూజిక్: మధు బాపు శాస్త్రి
==> సాంగ్స్: రాజేంద్ర రాజు కాంచనపల్లి, హరితస, కళా రత్న బిక్కి కృష్ణ, డాక్టర్ దాసరి వెంకటరమణ
==> నేపథ్య సంగీతం: చరణ్ అర్జున్
==> కో డైరెక్టర్స్: శేషు కుమార్, కళింగ రంగనాథ్ కొత్తకోట
==> పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి
==> ఆర్ట్ : దుద్దుపూడి ఫణి రాజు
==> ప్రొడక్షన్ చీఫ్ : రాంబాబు రామకృష్ణ రాజు.
==> కొరియోగ్రాఫర్: గిరి
==> ప్రొడక్షన్ : శివ
==> మేకప్: కరుణాకర్, లక్ష్మి.
Also Read: Gold Rate Today: లక్కీ ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. సంక్రాంతి పండగ కంటే ముందే కొనేయ్యండి
Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter