చిత్రం: పద్మావత్ 
తారాగణం: రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, షాహిద్ కపూర్..  తదితరులు 
దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాత: సంజయ్ లీలా భన్సాలీ, ఆఖివ్ అలీ 
కెమెరామెన్: సుదీప్ ఛటర్జీ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన "పద్మావత్" చిత్రం ఎట్టకేలకు తెరపై కనిపించింది. మంగళవారం ప్రీమియర్ షోలు పడిపోయాయి. 2 గంటల 40 నిమిషాల నిడివిగల పద్మావత్ చిత్రం ఎలా ఉంది? టాక్ ఏమిటి? అనే విషయానికి వస్తే.. 


2017లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిత్రం పద్మావత్. ఈ చిత్రంలో రాజ్ పుత్ లను అగౌరవపరిచే సన్నివేశాలు ఏవీ లేవు అని ఎంతచెప్పిన ఆందోళనకారులు వినలేదు. ఈ చిత్రం జయసీ నవల ఆధారంగా తెరకెక్కించినట్లు మొదట్లోనే స్పష్టంగా  డిస్క్లైమర్ ఇచ్చింది. 


ఢిల్లీ సుల్తాన్ అల్లాదీన్ ఖిల్జీ గురించి చరిత్రకారులకు తెలిసే ఉంటుంది. అతను ప్రపంచంలో అందమైనవి, అద్భుతమైనవి తనవద్దే ఉండాలని ఆశ పడే వ్యక్తి. చిత్తోర్ఘర్ పూజారి రాఘవ్ చేతన్ పద్మావతి సొగసు, అందచందాల గురించి ఖిల్జీకి చెప్తాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని ఖిల్జీ ఆశపడి.. ప్రయత్నాలు చేసి.. చివరకు యుద్ధం వరకు వెళతాడు. మరి ఖిల్జీ పద్మావతిని దక్కించుకున్నాడా? లేదా పద్మావతి వీరత్వానికి, ధైర్యసాహసాలకి తలవంచాడా? అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది.  


ఇది కూడా చదవండి: రాణి పద్మిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు


ఈ కథ ఇదివరకు చెప్పినట్లు చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ..  సినిమా తెరకెక్కించిన తీరు సూపర్. భన్సాలీ ఆ విషయంలో విజయం సాధించాడు. చరిత్ర మీద అవగాహన లేని ప్రేక్షకుడు సైతం కథలోకి సులువుగా ప్రవేశిస్తాడు. సినిమాలో ప్రతి పాత్ర  వైవిధ్యంగా  చిత్రీకరించబడింది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది.  సుదీప్ చటర్జీ ద్వారా కెమెరా పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. 


ఎవరెలా చేశారు? రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, షాహిద్ కపూర్.. పాత్రలను దర్శకుడు తెరపై చూపించిన విధానం బాగుంది. ఈ మూడు పాత్రల్లో రణవీర్ పాత్రకు ప్రేక్షకులు ఎక్కువ మార్కులు వేస్తారు. అలానే దీపికా నటనను, రొమాంటిక్ పాత్రలో కనిపించే షాహిద్ ను చూసి వీక్షకులు ముగ్దులవుతారు.  యుద్ధ సన్నివేశాలపై దర్శకుడు బన్సాలీ అంత ద్రుష్టి పెట్టలేకపోయినా.. కథను ఆసక్తిగా చెప్పడంలో సఫలీకృతుడయ్యాడు.