Paytm Cards| డిజిటల్ ఫైనాన్స్ సర్వీస్ ప్రొవైడర్ పేటీఎం ( Paytm ) త్వరలో క్రెడిట్ కార్డులు విడుదల చేయనుంది. ఈ మేరకు సోమవారం రోజు సంస్థ ఒక ప్రకటన చేసింది. వివిధ ఆర్థిక సంస్థలతో జతకట్టనున్న పేటీఎం వచ్చే 12 నుంచి 18 నెలలలో 20 లక్షల కార్డులను జారీ చేయనుందట.



పేటీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు ( Credit Cards ) లేని వారు కూడా కార్డులు తీసుకునే అవకాశం కలుగుతుంది అని సంస్థ తెలిపింది. మన దేశంలో క్రెడిట్ కార్డులను కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాని వల్ల లాభాలు పొందే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. భారతదేశ యువతకు క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తెచ్చి వారికి అండగా ఉండాలి అని పేటీఎం నిర్ణయించింది అని సంస్థ తెలిపింది.



ఆర్థిక సవాళ్లను సరైన విధానంలో ఎదుర్కోవడానికి, డబ్బును వారి ఎదుగుదలకు అనుకూలంగా వినియోగించే విధంగా  ఈ కార్డులను సిద్ధం చేశాం అని పేటీఎం తెలిపింది. ప్రస్తుతం భారత దేశంలో కేవలం 3 శాతం మాత్రమే క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి అని.. అదే అమెరికాలో ( America ) అయితే 320 శాతం వినియోగం ఉంది అని తెలిపింది. తము ప్రవేశపెట్టే క్రెడిట్ కార్డు వల్ల ఈ లోటు భర్తీ అయిన కొత్త క్రెడిట్ విభాగం ( New To Credit ) ఏర్పాటు అవుతుంది అని తెలిపింది.




A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.



Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR