Adipurush villain: విలన్ పాత్రపై ప్రభాస్ ఇచ్చిన అప్డేట్
Prabhas 22వ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఆగస్ట్ 18న ఉదయం 7.11 గంటలకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ `ఆదిపురుష్` సినిమాను ( Adipurush movie ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఒక వైరల్ టాపిక్‌గా మారిన ఈ ప్యాన్-ఇండియన్ ప్రాజెక్టును టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు.
Prabhas 22వ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఆగస్ట్ 18న ఉదయం 7.11 గంటలకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ 'ఆదిపురుష్' సినిమాను ( Adipurush movie ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఒక వైరల్ టాపిక్‌గా మారిన ఈ ప్యాన్-ఇండియన్ ప్రాజెక్టును టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు. 2022లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముని పాత్ర ( Prabhas as lord sriram ) పోషించనున్నాడు. Also read : Hyderabad metro rail: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు.. తెలుసుకోవాల్సిన విషయాలు
ఐతే ఇప్పటివరకు ఈ సినిమాలో శ్రీ రామునిగా ప్రభాస్ చేయనున్నట్లు తెలిపిన చిత్ర బృందం.. మిగతా క్యారెక్టర్స్‌ను ఎవరు పోషిస్తున్నారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ముఖ్యంగా రావణుడి పాత్ర ( Ravan in Adipurush ), సీత పాత్రపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాలో రావణాసురుని పాత్రలో ఎవరు చేయబోతున్నారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టాడు. "7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ( Intellegent demon ) ఉండేవాడని హింట్ ఇచ్చిన ప్రభాస్.. మిగతా వివరాలు రేపు ఉదయం 7.11 గంటలకు" అని పోస్ట్ చేశాడు. అంటే రేపు ఆ రావణాసురుని పాత్రలో ఎవరు చేయబోతున్నారనే విషయాన్ని ప్రకటించనున్నారన్న మాట. ఇదే విషయాన్ని ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రావుత్ ( Om Raut ) కూడా సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్‌తో పంచుకున్నారు. Also read : Pawan Kalyan: పవన్ 28 మూవీ.. క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
ఆదిపురుష్ మూవీలో ( Adipurush ) రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) నటించబోతున్నట్లు చాలా కథనాలు వచ్చాయి. ఇంతకి ఆ కథనాలు నిజమో, కాదో తెలియాలంటే రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిందే మరి. Also read : Mahesh Babu: పవన్ కల్యాణ్‌కు మహేష్ బాబు స్పెషల్ విషెస్