Pawan Kalyan: పవన్ 28 మూవీ.. క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల గురించి మేకర్స్ పవన్ అభిమానులకు ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.

Last Updated : Sep 2, 2020, 05:32 PM IST
Pawan Kalyan: పవన్ 28 మూవీ.. క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

PSPK 28th Movie Update: ప్రముఖ టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల గురించి మేకర్స్ పవన్ అభిమానులకు ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఉదయం పవన్ నటించే.. వకిల్ సాబ్ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా.. మధ్యాహ్నం పవన్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ప్రీపోస్టర్ రిలీజ్ అయింది. అయితే సాయంత్రం హరీష్ శంకర్ కాంబినేషన్‌లో నటించే 28వ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ మేరకు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Also read: Pawan Kalyan: పవన్ 27వ సినిమా అప్‌డేట్.. ఇదే

అయితే ఈ సినిమా పోస్టర్‌లో హార్లీడేవిడ్‌సన్ బైక్‌పై పెద్ద బాలశిక్ష ఫొటో, గులాబీ పువ్వు ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇండియా గేట్ చిత్రం దానిపై PSPK28 అని రాసి ఉండటంతోపాటు సర్ధార్ వల్లభభాయ్ పటేల్‌, సుభాష్ చంద్రబోస్ ఫోటోలున్నాయి. అంతేకాదు పోస్టర్‌ కింద ఇట్స్ టైమ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని కాప్షన్ ఇచ్చారు హరీశ్ శంకర్. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించే ఈ చిత్రాన్ని సమకాలీన రాజకీయ అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో చిత్రీకరించనున్నట్లు హరీశ్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్‌లో చెప్పకనే చెప్పారు. అయితే ఈ సినిమాను మళ్లీ గబ్బర్ సింగ్ బ్యాచ్ తెరకెక్కిస్తుండటంతో అభిమానుల్లో ఆనందోత్సాహం రెట్టింపు అవుతోంది. Also read: Pawan Kalyan: వారి మరణం మాటలకు అందని విషాదం

Trending News