Grey Movie Telugu Review: ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమా ఆకట్టుకుంటుంది అంటే కచ్చితంగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే దర్శక నిర్మాతలు కూడా బడ్జెట్ తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక సినిమాల్లో నటిస్తూ దర్శకుడుగా రిషి లాంటి సినిమాలు తెరకెక్కించిన రాజ్ మాదిరాజు గ్రే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మే 26వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో అవార్డులు కూడా సంపాదించింది. అలాంటి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరచుకుంది. ఆ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రే కథ విషయానికి వస్తే
సైంటిస్ట్ కం ప్రొఫెసర్ అయిన సుదర్శన్ రెడ్డి(ప్రతాప్ పోతెన్) అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆయన ఎలా చనిపోయాడు? అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఆఫీసర్ నాయక్(అలీ రెజా) సుదర్శన్ రెడ్డి ఇంటికి వస్తాడు. సుదర్శన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్న క్రమంలో అతనికి సుదర్శన్ రెడ్డి భార్య ఆరుషి(ఊర్వశి రాయ్)తో పరిచయం అవుతుంది. మొదటి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిన నాయక్ ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఆమెను ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక బలహీన క్షణంలో వారిద్దరూ సుదర్శన్ రెడ్డి శవం ఉండగానే శారీరకంగా ఒకటవుతారు. ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి చావుకు కారణమైన డాక్టర్ రఘు(రఘు)ని ఇంటికి పిలిపించి నాయక్ ఇంటరాగేట్ చేస్తాడు. సుదర్శన్ రెడ్డి చావుకు కారణమైన ఒక వస్తువుని తీసుకుని ఆరుషిని తీసుకు వెళ్ళడానికి మళ్లీ వస్తానని చెప్పి వెళ్తాడు నాయక్. అయితే అసలు నిజంగా సుదర్శన్ రెడ్డిని చంపింది ఎవరు? నాయక్ ఆరుషిని కాపాడేందుకు వెనక్కి వచ్చాడా? డాక్టర్ రఘు అసలు ఎందుకు సుదర్శన్ రెడ్డిని చంపాలనుకున్నాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ
సాధారణంగా అనేకమంది న్యూక్లియర్ సైంటిస్టులు అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా అనేక వార్తా కథనాలు ఉన్నాయి. ఇండియాకి చెందిన ప్రముఖ న్యూక్లియర్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ కూడా అదే విధంగా అనుమానాస్పదంగా మృతి చెందారని ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. ఇలాంటి అంశంతోనే ఈ కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. సుదర్శన్ రెడ్డి అనే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు. కధ ప్రారంభం కావడమే సుదర్శన్ రెడ్డి మరణంతో ప్రారంభమవుతుంది. అతను ఎలా చనిపోయాడు? అతని చావుకు కారణాలేంటి? అనే విషయాలను కూలంకషంగా ఒక్కటొక్కటిగా చూపిస్తూ వెళ్ళాడు. నిజానికి సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో తెలియని గందరగోళం ఏర్పడుతుంది.


Also Read:2018 Telugu Review: మలయాళంలో కోట్లు కొల్లగొట్టిన '2018' రివ్యూ -రేటింగ్.. ఎలా ఉందంటే?


ఒకపక్క శవం ఉంటే చనిపోయిన వ్యక్తి భార్యతో పోలీస్ ఆఫీసర్ రొమాన్స్ ఏంటి? అనే అనుమానం అందరినీ తొలిచేస్తూ ఉంటుంది. దాదాపుగా ఇంటర్వెల్ వరకు సుదర్శన్ రెడ్డి ఎలా చనిపోయాడు? అనే విషయాన్ని నాయక్ అనే ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు చూపించారు. అయితే ఇంటర్వెల్ తరువాత సినిమా కథనంలో వేగం పెరిగింది. అసలు సుదర్శన్ రెడ్డి ఎవరు? సుదర్శన్ రెడ్డితో ఆరుషి ప్రేమలో పడడానికి కారణం ఏమిటి? డాక్టర్ రఘు సుదర్శన్ రెడ్డి ఆరుషి జీవితంలోకి వచ్చి ఏం చేశాడు? అసలు డాక్టర్ నాయక్ ఆఫీసరేనా? వంటి విషయాలను ఒక్కటొక్కటిగా రివీల్ చేస్తూ ఔరా అనిపించాడు దర్శకుడు. కథలో కొన్నిచోట్ల లాజిక్స్ మిస్ అవుతాయి కానీ ఫైనల్ గా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని క్లైమాక్స్ లో క్లారిటీగా చెప్పుకొచ్చాడు. గందరగోళ పరుస్తూనే సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అందులో చాలా వరకు సక్సెస్ఫుల్గా నిలబడ్డాడు.


నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమాలో అరవింద్, ఊర్వశి రాయ్, రాజ్ మాదిరాజు, ప్రతాప్ పోతేన్ వంటివారు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఊర్వశి రాయ్ తెలుగు సినిమాలకు కొత్త అయినా ఏ మాత్రం భయం బెరుకు లేకుండా రొమాంటిక్ సీన్స్ లో కూడా రెచ్చిపోయింది. అలి రెజా, అరవింద్ కూడా ఒక రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ పండించారు. ఇక ప్రతాప్ పోతెన్ నటనా అనుభవాన్ని మనం ఎక్స్ పీరియన్స్ చేస్తాం. ఇక ఇదే ఆయనకు చివరి చిత్రం కావడం గమనార్హం. మిగతా పాత్రలు పోషించిన నటీనటులు కూడా న్యాయం చేశారు. 


టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా డైరెక్టర్ రాజ్ మాదిరాజు తాను చెప్పాలనుకున్న పాయింట్ ని నేరుగా చెప్పకుండా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలనుకున్నాడు అది కొంతవరకు సక్సెస్ అయింది. ప్రతి మనిషిలోనూ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది అని చెబుతూనే ఒక ఆసక్తికరమైన కథ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి దాదాపు చాలా వరకు సఫలమయ్యారు. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన నాగరాజు తాళ్లూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని పాటలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేతన్ మధురాంతకం తన పనితనాన్ని చూపించాడు. సినిమా మొత్తాన్ని గ్రే కలర్ లోనే చూపిస్తూ ప్రేక్షకులకు కొత్త ఫీల్ అందించే ప్రయత్నం చేశారు. ఇక సినిమా నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా కరెక్ట్ గా సరిపోయాయి.


ఫైనల్ గా:
ఇంట్రెస్టింగ్ స్పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 


Rating:  2.75/5


Also Read: Malli Pelli Movie Controversy: మళ్ళీ పెళ్లి మూవీ గురించి స్పందిస్తూ నరేష్, పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK