Sravani Suicide Case: లొంగిపోయిన దేవరాజ్.. టాలీవుడ్ నిర్మాతను విచారించనున్న పోలీసులు
సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు (TV Actress Sravani Suicide Case)లో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న దేవరాజ్ రెడ్డి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ కేసులో నిర్మాత అశోక్ రెడ్డిని, సాయి కృష్ణారెడ్డి అనే యువకుడిని సైతం పోలీసులు విచారించనున్నారు.
మనసు మమత సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు (TV Actress Sravani Suicide Case)లో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న దేవరాజ్ రెడ్డి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసుల ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి దేవరాజ్ హైదరాబాద్‌కు వచ్చి లొంగిపోయాడని సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. మొదటగా దేవరాజ్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న కాల్ రికార్డింగ్ డేటాను పోలీసులు సేకరించినట్లు సమాచారం. Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్
నిర్మాత అశోక్ రెడ్డి శ్రావణికి ఆర్థికంగా సహాయం చేసేవాడని తెలిసి ఆమెను తాను పక్కన పెట్టానని పోలీసులకు దేవరాజ్ వెల్లడించాడు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కృష్ణారెడ్డి అనే యువకుడిని సైతం విచారించనున్నారు. కుటుంబసభ్యులు, సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని.. గతంలో ఆమెను కొట్టారని సైతం దేవరాజ్ పోలీసుల వద్ద ఆరోపించినట్లు తెలుస్తోంది. అయితే సాయి కృష్ణారెడ్డి మాత్రం తనకు ఈ ఆత్మహత్యతో సంబంధం లేదంటున్నాడు. శ్రావణి కుటుంబసభ్యులకు తానెప్పుడూ మద్దుతుగా ఉన్నానని, ఎక్కడికి పారిపోలేదని చెప్పడం గమనార్హం. Actress Sravani Funeral: నటి శ్రావణి అంత్యక్రియలు పూర్తి..
నిన్న దేవరాజ్, శ్రావణి ఆడియో సంభాషణతో పాటు ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. ఈ కేసుతో ఆయనకు సంబంధాలున్నాయని అశోక్ రెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అసలు శ్రావణి, దేవరాజ్ రెడ్డి, అశోక్ రెడ్డిల మధ్య రిలేషన్ ఏంటి.. కేసు (Actress Sravani Suicide Case)కు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. TV serial actress Sravani suicide case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది ?
ఫొటో గ్యాలరీస్:
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR