టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిన్న రాత్రి నిజామాబాద్‌లోని స్వస్థలంలో రెండో వివాహం చేసుకున్నారు. ఆదివారం ఉదయం తన కొత్త జీవితం విషయాల్ని వెల్లడించిన దిల్ రాజు వివాహం కొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగడం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం శుభకార్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి  నెటిజన్లు సెర్చ్ చేసిన అంశం ఒక్కటే. దిల్ రాజు భార్య ఎవరు, పేరేంటి, ఆమె ఏం చేస్తుంటారు. ఇలా ఆమె గురించి నెటిజన్లు సెర్చింజన్లలో తెగ వెతికేశారు. Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్ రాజు రెండో భార్య పేరు తేజస్విని. ఆమె గతంలో ఎయిర్ హోస్టెస్‌గా చేశారని సమచారం. జస్విని అనే బ్రాహ్మణ యువతిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కులాంతర వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ టైమ్ కావడంతో కేవలం కొందరు కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య నర్సింగ్ పల్లిలో గుడిలో దిల్ రాజు, తేజస్విని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. Mothers Day: దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు


నేటి ఉదయం నుంచి దిల్ రాజు, తేజస్విని దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త విషయం హాట్ టాపిక్ అవుతోంది. తేజస్విని పేరును పెళ్లి తర్వాత వైఘారెడ్డిగా మార్చేయాలని ముందే నిర్ణయించారు. తేజస్విని పేరు ఇకనుంచి వైఘారెడ్డి. జ్యోతిష్కుడితో సంప్రదింపుల తర్వాత వైఘారెడ్డి అనే పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ Photos వైరల్


అందుకు పెళ్లిలో సైతం వైఘా రెడ్డి పేరుతోనే సంబోధించినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు వ్యక్తిగతంగా, కెరీర్ రంగంలో కలిసిరావాలంటే భార్య పేరులో మార్పు అవసరమని జ్యోతిష్కుడి సలహా మేరకు తేజస్విని పేరు వైఘా రెడ్డిగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!