హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ఖ్యాతిని తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో నటించాలని ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి తర్వాత ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. కాగా అందరూ ఇప్పటికే ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌ కళ్యాణ్ తో సినిమాపై రాజమౌళి స్పష్టత ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నానని, ఆయనను కలిసి సినిమా గురించి  చర్చించానని, కానీ కుదరలేదన్నారు. ఇక ఇప్పుడు చేస్తాన‌ని న‌మ్మ‌కం లేదని, ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆయ‌న రాజ‌కీయాల్లో  ఉండ‌డం వ‌ల‌న త‌క్కువ సమ‌యంలో సినిమాలు చేస్తారు. నేనేమో ఏళ్ల త‌ర‌బ‌డి సినిమాలు చేస్తానని, కాబట్టి పవన్‌తో సినిమా తీసే అవకాశం లేదన్నారు. ఏపీలో దారుణం: లాఠీ దెబ్బలకు యువకుడి మృతి!  


పవన్ కళ్యాణ్‌కు సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న భావన 100 శాతం ఉంటే నాలో అది కేవలం 0.5 శాతం ఉంటుందని, ఆయన దృక్పథం వేరు నా ఆలోచన వేరు అని చెప్పుకొచ్చారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..