Gods Premier League: చైల్డ్ ఆర్టిస్ట్ యాని హీరోయిన్‌గా మరో మూవీ.. సరికొత్త కాన్సెప్ట్‌తో జి.పి.ఎల్
Gods Premier League Movie Updates: పవన్ శంకర్, యాని జంటగా రావు జి.ఎం నాయుడు దర్శకత్వంలో జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) అనే తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.
Gods Premier League Movie Updates: రాజన్న మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న యాని హీరోయిన్‌గా బిజీ అవుతోంది. రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) అనే సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్స్ నెంబర్ 1 ఈ సినిమాను రూపొందిస్తుండగా.. అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. పవన్ శంకర్, యాని జంటగా నటిస్తుండగా.. తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?
సరికొత్త కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నామని.. హైదరాబాద్, వైజాగ్, కోడై కెనాల్‌లో షూటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్‌కు స్టోరీ సరిగా సరిపోతుందని.. దేవుడి ఆదేశాల మేరకు మన నడుస్తామనే పాయింట్‌తో మూవీ ఉండబోతుందన్నారు.
అనంతరం ప్రొడ్యూసర్ అల్లు సాయి లక్ష్మణ్ మాట్లాడుతూ.. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. లవ్, సస్పెన్స్‌తో మూవీ ఉంటుందని.. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నట్లు వెల్లడించారు.
సాంకేతిక బృందం:
==> బ్యానర్: అల్లు ఆర్ట్స్
==> ప్రొడ్యూసర్: అల్లు సాయి లక్ష్మణ్
==> డైరెక్టర్: రావు జి.ఎమ్ నాయుడు
==> కెమెరామెన్: రామ్ కంద
==> సంగీతం: మణిశర్మ
==> చీఫ్ అసోసియేట్: శివ వేములవాడ
Also Read: Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి