Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్తా ఇప్పుడు బలహీనపడింది. అయినా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. పంటకోతల విషయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2024, 05:26 PM IST
Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో మోస్తరు వర్షాలుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఉండవచ్చు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. రేపట్నించి ఏపీ, తెలంగాణలోకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపధ్యంలో రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పండిన పంటను సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడవచ్చు. ఇక నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు , ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

ఇక తెలంగాణలో నవంబర్ 16 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నవంబర్ 17 నుంచి మాత్రం తెలంగాణలో ఎలాంటి వర్షసూచన లేదు. హైదరాబాద్‌లో రాత్రి పూట చలి పెరగనుంది. ఆకాశం మేఘావృతంగా ఉండవచ్చు

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, 53 శాతం డీఏతో కనీస వేతనం పెరగనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News