Ramajogayya Sastry Trolls : భజన.. ప్రతీ దానికి ఓ భజన.. రామజోగయ్య శాస్త్రీపై ట్రోల్స్
Trolls on Ramajogayya Sastry రామ జోగయ్య శాస్త్రి మీద మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీర సింహా రెడ్డి పాటల విషయంలో రామజోగయ్య శాస్త్రి వేస్తోన్న ట్వీట్ల, రాసిన పాటల మీద మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
Trolls on Ramajogayya Sastry ప్రస్తుతం సోషల్ మీడియాలో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లోని పాటల మధ్య పోటీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యాన్స్,మెగా అభిమానులు కాస్త హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. జై బాలయ్య పాటలోని లిరిక్స్ మీద మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. రామజోగయ్య శాస్త్రిని ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి రామజోగయ్య శాస్త్రి వేసిన ట్వీట్ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాస్త కౌంటర్ వేశాడు.
జై బాలయ్య అరుపులు, సుగుణ సుందరి కేకలు, మనోభావాలు మంటలు.. చెప్పినట్టే జరిగిందిగా.. నా లెక్క ప్రకారం ఈ సారొచ్చే పాట.. ఈ మూడు కలిపినంత.. ఏమంటారు? అని డైరెక్టర్‌ని ట్యాగ్ చేశాడు రామ జోగయ్య శాస్త్రి. ఈ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ అభిమాని ఇలా అన్నాడు. భజన.. ప్రతీ దానికి ఓ భజన అని కౌంటర్ వేశాడు. ఈ కౌంటర్‌పై రామజోగయ్య శాస్త్రి సెటైర్ వేశాడు. పాట వచ్చాక మాట్లాడుకుందాం పండూ అని కూల్‌గా రిప్లై ఇచ్చాడు.
అయితే రామజోగయ్య శాస్త్రి ట్వీట్ మీద మెగా ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు వీర సింహా రెడ్డి నుంచి వచ్చిన పాటలేవీ అంతగా క్లిక్ కాలేదని, అంతగా పాపులర్ కూడా అవ్వలేదని, ఇప్పుడు నాలుగో పాట గురించి ఎందుకు ఇంత చెబుతున్నావ్? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ రంగంలోకి దిగి రామజోగయ్య శాస్త్రికి మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోవద్దని ఆయనకు సపోర్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు.
వీర సింహా రెడ్డి పాటల కంటే.. వాల్తేరు వీరయ్య పాటలే ఎక్కువగా ట్రెండ్ అవుతోన్నాయి. జై బాలయ్య కంటే బాస్ పార్టీ, సుగుణ సుందరి కంటే చిరంజీవి శ్రీదేవీ పాటే ట్రెండ్ అయ్యాయి. ఇక మా బావ మనోభావాల్ అనే పాట కోసం వీరయ్య టైటిల్ సాంగ్ రేపు రాబోతోంది. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి
Also Read : Kushi Re Release Trailer : ఖుషి, ఒక్కడు రీ రిలీజ్.. ట్రైలర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఏది బెటర్ అంటే?
Also Read : Bigg Boss Ashu Reddy : అనాథ పిల్లల్ని చదివిస్తున్న అషూ రెడ్డి.. అందరినీ గెలిచేసిన బిగ్ బాస్ బ్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook