Regina Cassandra: రాత్రికి రాత్రే ప్రెగ్నెంట్ గా మారిన రెజీనా.. షాకింగ్ విషయం బయట పెట్టిందిగా!
Regina Cassandra claims as pregnant: సుధీర్ బాబు హీరోగా శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా తాను ఒక్క రాత్రిలో గర్భవతినయ్యానని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Regina Cassandra claims as pregnant: చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా కసాండ్రా చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది చిన్నప్పుడే ఒక కిడ్స్ ఛానల్ కోసం యాంకరింగ్ చేయడం మొదలుపెట్టిన ఆమె యుక్త వయసు వచ్చేనాటికి కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. తొలుత తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె తర్వాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. సుధీర్ బాబు హీరోగా శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా దక్కడం లేదు. దీంతో ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
ఈ మధ్యనే ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది అన్యాస్ ట్యుటోరియల్ అనే ఒక వెబ్ సిరీస్ తో ఆమె ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఆహాలో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఒక్క రాత్రిలో గర్భవతినయ్యానని కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటి ఒక రాత్రిలో గర్భవతి అవడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే మీరు అనుకున్నట్టు నిజంగా గర్భవతి కాలేదు. అసలు విషయం ఏమిటంటే ఆమెకు మిస్టీ దోయ్ అనే స్వీట్ అంటే చాలా ఇష్టమట.
ఒక అర్ధరాత్రి సమయంలో స్వీట్ షాప్ దగ్గరకు వెళ్లి ఆ స్వీట్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే అప్పుడే షాప్ యజమాని క్లోజ్ చేస్తూ కనిపించాడట. షాప్ ఓపెన్ చేసి తనకు స్వీట్ ఇవ్వమని అంటే షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం కష్టమని ఆయన చెప్పారట. తాను గర్భవతిని అని అబద్ధం ఆడటంతో గర్భవతికి తినాలనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన అప్పటికప్పుడు షాప్ ఓపెన్ చేసి ఆమెకు కావలసిన స్వీట్ ఇచ్చారట. అలా తను ఒక్క రాత్రిలో గర్భవతిని అయ్యానంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె చేసిన పని మీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె ఇలా చేయడం కరెక్ట్ కాదు అని కొందరు కామెంట్ చేస్తుంటే కావాల్సింది లెక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తారా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Kangana Ranaut Emergency: ఇందిరాగాంధీగా అదరకొట్టిన కంగనా రనౌత్
Also Read: Bahubali Scene: 'బాబుబలి' సీన్ రిపీట్.. అచ్చు రమ్యకృష్ణ మాదిరే చిన్నారిని కాపాడిన తల్లిదండ్రులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook