వీకెండ్ లో సినీ ప్రేక్షకులకు పండగే పండగ. ఒకటి కాదు రెండు  కాదు ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ కు  సిద్ధమయ్యాయి. దీని గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో ఈ వీకెండ్ ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఎప్పుడైనా ఇన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నప్పుడు వాటిలో ఒకటి లేదా రెండు మాత్రమే ఎట్రాక్ట్ చేస్తాయి. కాస్తోకూస్తో అంచనాలుంటాయి. కానీ ఈసారి వీటిలో ఏకంగా 4 సినిమాలు ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్నాయి. ఆ మూవీ డీటెయిల్స్ చెక్ చేద్దాం



 ఈ వీకెండ్ థియేటర్లలోకొస్తున్న మూవీ ఫలక్ నుమా దాస్. అన్నీతానై విశ్వక్ సేన్ తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరో ఇతడే. దీనికి డైరక్టర్ కూడా ఇతడే. డబ్బులు పెట్టి నిర్మాతగా సినిమా తీసింది కూడా ఇతడే. సురేష్ బాబు సపోర్ట్ తో థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. దీనికి కారణం ట్రయిలర్ క్లిక్ అవ్వడమే.


 


వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న మరో మూవీ ఎన్జీకే. నందగోపాలకృష్ణ ను షార్ట్ కట్ గా ఎన్జీకే అని మార్చారు. సూర్య నటించడంతో పాటు సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) డైరక్షన్ కావడంతో మూవీపై ఫోకస్ పెరిగింది. వీళ్లిద్దరి కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. సాయి పల్లవి, రకుల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పొలిటికల్ జానర్ లో వస్తోంది.


 


ప్రభుదేవా-తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా అభినేత్రి-2. కేఎల్ విజయ్ డైరక్షన్ లో గతంలో వచ్చిన అభినేత్రి సినిమాకు సీక్వెల్ ఇది. ట్రయిలర్ ఎట్రాక్టివ్ గా ఉండడం, వీడియో సాంగ్స్ క్లిక్ అవ్వడంతో ఈ సినిమాపై కాస్త ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. నందిత శ్వేత మరో ఎట్రాక్షన్.


 


ట్రయిలర్ తో ఎట్రాక్ట్ చేసిన మరో సినిమా సువర్ణ సుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. గ్రాఫిక్స్ కూడా క్లిక్ అవ్వడంతో సినిమాపై ఓ మోస్తరు బజ్ క్రియేట్ అయింది. జయప్రద, సాక్షి చౌదరి, పూర్ణ, రామ్, ఇంద్ర నటించిన ఈ సినిమాకు సూర్య దర్శకుడు. 45 నిమిషాల గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ ఎట్రాక్షన్స్.


 


వీటితో పాటు డిసెంబర్ 31, గాడ్జిల్లా-2 అనే మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్ని పక్కనపెడితే, మిగతా 4 సినిమాలపై ఆడియన్స్ లో బజ్ ఉంది. వీటిలో ఏ సినిమా ఈ వీకెండ్ క్లిక్ అవుతుందో చూడాలి.


 


 


 


 


@ జీ సినిమాలు