SBI introduces Email OTP service to customers for secure digital transactions: ఇటీవలి కాలంలో సైబర్‌ కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్‌ మోసాలతో ఎందరో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ నేరాలను నియంత్రించేందుకు దేశంలోని పలు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) సురక్షితమైన డిజిటల్ లావాదేవీల కోసం ఇ-మెయిల్‌ ఓటీపీని పరిచయం చేసింది.  ఎస్‌బీఐ యూసర్లు డిజిటల్‌ లావాదేవీలు చేసినప్పుడు అధికారిక ఇ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మీ డిజిటల్‌ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించండి. ఇందుకోసం ఇ-మెయిల్‌ ఓటీపీ నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇ-మెయిల్‌ ఓటీపీ సదుపాయాన్ని వెంటనే యాక్టివేట్‌ చేసుకోండి’ అని ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించే ఖాతాదారులు అందరూ ప్రొఫైల్‌ విభాగంలో, హైసెక్యూరిటీ అవకాశాల నుంచి ఈ సేవలను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.  ఇకపై ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు చెప్పాలని బ్యాంకు నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావని.. వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని ఎస్‌బీఐ తెలిపింది.


ఏటీఎంలో నుంచి నగదు తీసుకోవాలనుకున్న ప్రతిసారీ ఖాతాకు లింక్ చేసి ఉన్న మొబైల్‌ నెంబరుకు వచ్చే వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని నమోదు చేయాల్సి ఉంటుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తెలిపింది. ఖాతాదారులు తమ డెబిట్‌ కార్డుతో నగదు తీసుకోవాలంటే.. పిన్‌తో పాటు, ఓటీపీ కూడా నమోదు చేయాలి. గురువారం (డిసెంబరు 1) నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదార్లు ఏటీఎం నుంచి రూ. 10వేలకు మించి నగదు తీయాలనుకుంటే.. ఓటీపీ నమోదును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. 


Also Read: Gujarat Assembly Election 2022: గుజరాత్‌ తొలి విడత పోలింగ్‌.. బీజేపీ అభ్యర్థిపై దాడి!   


Also Read: Bank Holidays December 2022: డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.