ప్రఖ్యాత బ్రిటీష్ శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ చనిపోయారు. స్టీఫెన్ హాకింగ్(76) తన జీవితంలో ప్రపంచ మానవాళికి గొప్ప సందేశాన్ని మిగిల్చి వెళ్లారు. శరీరం పనికి సహకరిస్తున్నా.. లేకపోయినా.. కృష్ణబిలాలపై ఆయన పరోశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చాయన్నది అక్షర సత్యం. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. ప్రస్తుతం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టీఫెన్ హాకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:


* 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది.


* స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ఆక్స్ ఫర్డ్ లో ప్రారంభించారు. గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్న స్టీఫెన్ ను తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. ఆ తరువాత భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశారు.


* 1963లో, 21 సంవత్సరాల వయస్సులో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. నాడీ మండలంపై అంటే నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా...!  


* 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు స్టీఫెన్. క్వాంటం థియరీ, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నారు.


* 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. ఆ సమయంలోనే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నారు.


* 1988లో 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్' పుస్తకాన్ని వెలువరించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ... కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల ఆ పుస్తకం 1998లో  గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.


* 2014లో హాకింగ్ జీవిత విశేషాలతో 'ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్' అనే సినిమా తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.


* సోషల్‌ మీడియాలో చేరిన క్షణాల్లోనే స్టీఫెన్ హాకింగ్ మిలియన్‌ ఫాలోవర్స్‌ను పొందారు. ఇక స్టీఫెన్ హాకింగ్ చేసిన తొలి పోస్ట్‌కు క్షణాల్లో ఏకంగా ఐదులక్షల లైక్లు వచ్చాయి.


* హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జీవిత కాల సభ్యునిగా ఉన్నారు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నారు. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటీషర్ల జాబితాలో 25వ స్థానం అతనిదే.


* అవార్డులు: 1979లో  అల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్, 1982లో ఆర్డర్ ఆఫ్ బ్రీటీష్ ఎఒపైర్ (కమాండర్), 1988లో భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతితో పాటు అనేక దేశాల బహుమతులను, ప్రశంసలను అందుకున్నారు. స్టీఫెన్ ఇప్పటివరకూ నోబెల్ బహుమతిని అందుకోలేదు.