Sushant Singh Rajput`s cremation | ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పార్థివదేహానికి ముంబైలోని బాబా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అంత్యక్రియలకు ముంబైలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పాట్నాలో ఉంటున్న సుశాంత్ తండ్రి కెకె సింగ్ ( Sushant`s father), చండీఘడ్‌లో ఉంటున్న సుశాంత్ సోదరి, ఇతర కుటుంబసభ్యులు ముంబైకి చేరుకోనున్నారు. అనంతరం ముంబైలోనే సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో ప్రస్తుతం పలు లాక్ డౌన్ నిబంధనలు అమలు ఉన్నాయి. దీంతో సుశాంత్ అంత్యక్రియలకు అత్యంత సమీప బంధువులు తప్ప ఇతరులు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. కేకె సింగ్‌కి సుశాంత్‌తో పాటు మొత్తం ఐదుగురు సంతానం. వాళ్లంతా రేపటిలోగా ముంబైకి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చండీఘడ్‌లో ఉన్న సుశాంత్ సోదరి ( Sushant`s sister) తొలుత పాట్నాకు వెళ్లి... అక్కడి నుంచి తన తండ్రి కేకే సింగ్‌ని వెంట తీసుకుని ముంబైకి రానున్నారు. (  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ) 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఏ కారణం చేత సుశాంత్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్లాట్ అంతా వెతికినప్పటికీ.. ఎక్కడా ఎలాంటి సూసైడ్ నోట్ (Suicide note) లభించలేదని ముంబై డిసిపి ప్రణయ్ అశోక్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా సుశాంత్‌ సింగ్‌కు సంబంధించిన మెడికల్‌ రికార్డులు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అన్నీ పరిశీలిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి వైద్య సేవలు అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ నుంచి సైతం పోలీసులు వాంగ్మూలం సేకరించారు. ( వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST )


యాదృచ్ఛికంగా సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ( Disha Salian`s death) కూడా ఐదు రోజుల క్రితమే అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందారు. ఆమె మరణాన్ని యాక్సిడెంటల్ డెత్‌గానే భావిస్తున్నప్పటికీ.. దాని వెనుక సూసైడ్ యాంగిల్ ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. దిశా సలియన్ మృతి చెందినప్పుడే.. ఆమె మృతిని ఓ షాకింగ్ న్యూస్‌గా పేర్కొంటూ ఆమె కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించిన సుశాంత్.. ఇప్పుడిలా తన కుటుంబసభ్యులకే తీరని శోకాన్ని విడిచి వెళ్లిపోయారు. Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవ్ స్టోరీ, బ్రేకప్ )  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..