Tollywood Heros Accepting Telugu Producer guild Demands: రోజురోజుకు పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం తగ్గించుకోవడం కోసం తెలుగు సినీ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్ నిలిపివేయాలని తాజాగా అధికారిక ప్రకటన చేసింది . నికి సంబంధించి అందరితో చర్చించిన తర్వాతే మళ్ళీ షూటింగ్స్ మొదలుపెడతామని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయం విషయంలో ఇప్పుడు హీరోలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవడానికి హీరోలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారితో మంతనాలు జరిపారని, తాము రెమ్యూనేషన్లు తగ్గించుకుని సినిమాలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.


ఇక ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి సైతం లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఇక ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్ లు నిలిపివేసి చర్చల తర్వాత షూటింగ్ లు చేయాలని నిర్ణయం తీసుకుంటే తెలుగు సినీ నిర్మాతలు మండలిలో మాత్రం నిర్ణయం మీద లుకలుకలు ప్రారంభమయ్యాయి అని ప్రచారం జరుగుతోంది. గిల్డ్ చెప్పినట్లు వినకుండా సినిమా షూటింగులు కంటిన్యూ చేయాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.


అయితే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయం విషయంలో హీరోల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఖచ్చితంగా సినిమా పరిశ్రమ బాగుండాలంటే నిర్మాణ వ్యయం తగ్గాలని కూడా కొందరు హీరోలు అభిప్రాయబడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈరోజు దిల్ రాజు ఆఫీసులో యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ మరోసారి సమావేశం కాబోతోంది. ఈరోజు సాయంత్రానికి మరిన్ని నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.