రైల్వే ప్రయాణీకులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇచ్చింది. గత కొద్దికాలంగా ఈ విషయంపై చర్చ నడుస్తున్నా..ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఈ విషయంపై ప్రకటన వెలువడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తోంది. కొన్ని బ్యాంకుల్ని కూడా ప్రైవేటుపరం చేయనుంది. ఈ క్రమంలో భారతీయ రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్నారనే వార్తలు చాలాకాలంగా విన్పిస్తున్నాయి. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అడిగిన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇప్పుడు మరోసారి చెబుతున్నామని..భారతీయ రైల్వే ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. రైల్వే మంత్రి ప్రకటన అనంతరం రైల్వే ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్టైంది. 


ఇండియన్ రైల్వే విషయంలో ప్రభుత్వ ప్రణాళికలు


రానున్నకాలంలో రైల్వేలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చాలా రైళ్లలో మార్పులు వస్తాయన్నారు. ఇండియన్ రైల్వేస్ రానున్న రోజుల్లో అడ్వాన్స్ అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు వేగవంతంగా నడుస్తున్నాయన్నారు. రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని..రైల్వే తరపునన జీసీటీ విధానం అభివృద్ధి కానుంది. 


రైల్వే ఏర్పాట్లపై మంత్రి వివరణ ఇచ్చారు. టెర్మినల్ నిర్మాణం, నిర్వహణ కోసం జీసీటీ ఆపరేటర్లను టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. రైల్వే టెర్మినల్‌ను రైల్వే యేతర స్థలంపై అభివృద్ధి చేసేందుకు జీసీటీ ఆపరేటర్లకు అనువైన స్థల ఎంపిక బాధ్యత అప్పగించనున్నారు. 


Also read: Pancard Updates: రెండు పాన్‌కార్డులున్నాయా..వెంటనే సరెండర్ చేయకపోతే కలిగే ఇబ్బందులివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook