మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి లేటెస్ట్‌గా తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న హీరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej). డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’ (Uppena Movie). ముఖ్యంగా సినిమాలో నీ కన్ను నీలి సముంద్రం.. పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వాస్తవానికి కరోనా వైరస్ సమస్య లేకపోతే ఏప్రిల్ తొలి వారంలో ఉప్పెన విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఉప్పెన మూవీ ఇప్పట్లో థియేటర్లకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీన్ని ఎలాగైనా ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంటుంది. Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్


అయితే పూర్తిగా ఎడిటింగ్ చేయకుండా ఉప్పెన సినిమాను రెండు భాగాలుగా అందించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే ఎలా ఉంటుందని నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ యోచిస్తున్నాయి. ఇది ఓకే అయితే ఓటీటీలో రెండు భాగాలుగా ఉప్పెన మూవీని మరింతగా ఆస్వాదించవచ్చు. తక్కువ కత్తెర వేస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి 
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ