దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు గాంచిన స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేష్ తమ విలువైన సమయాన్ని గడిపారు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. సరదాగా విదేశాలకు టూర్లకు వెళ్లి అక్కడి ఫొటోలను సైతం షేర్ చేయడం అలవాటైంది. ఈ క్రమంలో మదర్స్ డే రోజు దర్శకుడు విఘ్నేష్ నయనతారకు తెలిపిన విషేస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.  ఈ వయసులో పెళ్లి అవసరమా.. శ్రీరెడ్డి రచ్చ రంబోలా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నయనతార ఓ చిన్నారిని ఎత్తుకున్న ఫొటోను విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో ఉన్న బాబు తల్లికి, ఆ బుజ్జాయికి ఆడిస్తున్న భవిష్యత్తులో నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో తాను, నయనతార త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లయింది.  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు



తన తల్లికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం నేను చూసే దేవుడు అమ్మ అంటూ తల్లిపై తన ప్రేమను చాటుకున్నాడు. నాకు కావాల్సింది దొరకాలని ఎప్పుడూ మనసారా దీవించే వ్యక్తి అని అమ్మతో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేశారు. అయితే లాక్‌డౌన్ తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుందంటూ వీరి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!