Vodafone Idea KBC 2022 Recharge Plan: భారతదేశంలోని టెలికాం రంగంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా (VI) దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ యూజర్లకు బంపర్ ఆఫర్‌లు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అతి తక్కువ ధరలో మీ స్మార్ట్‌ఫోన్‌లో KBC 2022 ఎపిసోడ్‌లను చూడొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో KBC 2022 అన్ని ఎపిసోడ్‌లను చూడొచ్చు. ఇది డేటా వోచర్ ప్లాన్. అంటే రూ. 82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. రూ. 82 ప్లాన్‌తో వినియోగదారులు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. ఇక SonyLIV సబ్‌స్క్రిప్షన్ 28 రోజులకు ఇవ్వబడుతోంది. అయితే ఇది మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అని గుర్తుంచుకోండి. టీవీలో చూసే సౌకర్యం లేదు.


వోడాఫోన్ ఐడియా వినియోగదారులు SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ను ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత.. ఈ సబ్‌స్క్రిప్షన్ పాజ్ చేయబడదు లేదా డియాక్టివేట్ చేయబడదు. మీరు SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా కేవలం KBC 2022 కాకూండా.. మీరు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమయ్యే ఇతర షోలు మరియు సినిమాలను కూడా చూడొచ్చు. SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ను పొందిన వారు ఒరిజినల్‌ టీవీ షోలు, సినిమాలు మరియు ప్రాచుర్యం పొందిన సీరియల్స్ చూడవచ్చు. 


SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ని సంవత్సరం కాలం కూడా పొందవచ్చు. SonyLIV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి రూ. 999 ప్లాన్ ఉంది. టీవీలో చూసే సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. మీరు KBC 2022 సీజన్‌ని చూడాలనుకుంటే కనుక వోడాఫోన్ ఐడియా అందించే ఈ ప్లాన్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. 


Also Read: బురద నీటిలో స్నానం, యోగా చేస్తూ.. ఎమ్మెల్యే ముందు యువకుడి వినూత్న నిరసన!


Also Read: ఎంఎస్ ధోనీ సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో! పోలా అదిరిపోలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook